Thursday, January 23, 2025

‘కెజిఎఫ్ 2’ వేడుకకు సూపర్ స్టార్

- Advertisement -
- Advertisement -

Superstar for the ‘KGF2’ celebration

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కేజీఎఫ్ 2. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి టీజర్, తుఫాన్ సాంగ్‌ను విడుదల చేయగా భారీ స్పందన వస్తోంది. అయితే ట్రైలర్ రిలీజ్‌తో సినిమాపై అంచనాలను పెంచేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ చిత్రం ట్రైలర్‌ను ఈనెల 27వ తేదీన సాయంత్రం విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. శివ రాజ్ కుమార్ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా క్రేజ్ తీసుకు వచ్చేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ను వ్యాఖ్యాత గా తీసుకోవడం జరిగింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్, రవీనా టాండన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News