Wednesday, January 22, 2025

సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్‌: ప్రిన్స్ మహేష్ బాబు తండ్రి సూపర్‌స్టార్‌ కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై గచ్చిబౌలి కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులిటెన్ విడుదల చేశారు. ఐసియులో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్డియాక్‌ ఆరెస్టుతో కృష్ణను ఆస్పత్రికి తీసుకరావడంతో కార్డియాలజిస్టుల బృందం ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోంది. కృష్ణకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 24గంటల వరకు ఏమీ చెప్పలేమని, ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు మరోసారి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేస్తామని వైద్యులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News