Saturday, December 21, 2024

సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం

- Advertisement -
- Advertisement -

తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేసి, సౌజన్యానికి, సాహసానికి నిలువెత్తు నిర్వచనంగా నిలిచిన సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర —– కృష్ణ విజయం’. అంబుజా మూవీస్, – రామ్ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై హెచ్.మధుసూదన్ దర్శక నిర్మాతగా రూపొందిన ఈ చిత్రంలో యశ్వంత్, – సుహాసిని జంటగా నటించగా… నాగబాబు, ఆలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శనివారం సూపర్ స్టార్ కృష్ణ ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించి, విడుదల తేది ప్రకటించేందుకు పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో నిర్మాతల మండలి అధ్యక్షులు కె.ఎల్.దామోదర్ ప్రసాద్, దర్శకుల సంఘం అధ్యక్షులు వీరశంకర్, ప్రముఖ దర్శకనిర్మాత సునీల్ కుమార్ రెడ్డి, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, మధుమిత, కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాదర్ గోరి, పద్మాలయ శర్మ, ధీరజ అప్పాజీ, దర్శకనిర్మాత హెచ్.మధుసూదన్, సహ నిర్మాత బండ్రి నాగరాజ్ గుప్తా పాల్గొన్నారు. సూపర్ స్టార్ కు ఘన నివాళి అర్పించిన అనంతరం… సినిమాను జనవరి- 3న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ప్రేమచరిత్ర – కృష్ణ విజయం‘ కృష్ణ నటించిన చివరి చిత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని, కృష్ణను అభిమానించే ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని అతిధులు ఆకాంక్షించారు. సూపర్ స్టార్ కృష్ణకు సంక్రాంతితో గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దర్శకనిర్మాత మధుసూదన్‌ను అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News