Wednesday, January 22, 2025

సూపర్ స్టార్ కృష్ణ మృతితో శోకసంద్రంలో టాలీవుడ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రముఖ నటుడు కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. నటుడు కృష్ణకు గుండెపోటు రావడంతో ఆసుపత్రిలో చేరి వెంటిలేటర్‌పై ఉంచిన సంగతి తెలిసిందే. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అయ్యిందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నటుడు కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివ రామ కృష్ణ మూర్తి, అతను 31 మే 1943 న గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించాడు.

నటుడు కృష్ణ 1965లో ‘తేనె మనసులు’ సినిమాతో తెరంగేట్రం చేశారు. దాదాపు 350 సినిమాల్లో నటించిన ఆయన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తెలుగు పరిశ్రమ చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ఆయన మృతితో టాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. వరుస విషాదాలతో మహేష్ బాబు దు:ఖ సాగరంలో మునిగిపోయారు. ఆయనకు సినీ ప్రముఖలంతా ఫోన్ చేసి ధైర్యం చెబుతున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీలో ఈ ఏడాది మూడు విషాదాలు చోటుచేసుకున్నాయి. జనవరిలో కృష్ణ కుమారుడు మరణించారు. సెప్టెంబరులో కృష్ణ భార్య ఇందిరా, మహేష్ బాబు తల్లి కన్నుమూశారు. ఇప్పుడు కృష్ణ కూడా ప్రాణాలు విడిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News