హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. ఆదివారం రాత్రి గుండెపోటు రావడంతో కుటుంబీకులు ఆయనను గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. కార్డియాల్ అరెస్ట్ ప్రభావం కిడ్నీలు, ఊపిరితిత్తులుపై కూడా పడటంతో కృష్ణ ఆరోగ్యం విషమించిందని నిన్న వైద్యులు వెల్లడించారు. వెంటిలేటర్ పై చికిత్స అందించినప్పటికీ కృష్ణ ప్రాణాలను కాపడలేకపోయారు వైద్యులు. ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆయన తదిశ్వాస విడిచినట్లు వైద్యులు వెల్లడించారు. 1942 మే31 న ఘట్టమనేని కృష్ణ గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణమూర్తి. 1464కు ముందు చిన్న చిన్న పాత్రలు చేసిన ఆయనకు 1964-65లో హీరోగా నటించే అవకాశం వచ్చింది. హీరోగా నటించిన మొదటి సినిమా తేనెమనసులు. 340పైగా సినిమాల్లో కృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. కృష్ణ భార్య, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి కొద్దిరోజుల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం ప్రకటించారు.