Friday, January 10, 2025

ఒరిగిన ‘నట’శిఖరం

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ నట శిఖరం నేలకొరిగింది. నటశేఖర సూపర్ స్టార్ కృష్ణ (79)మంగళవారం తెల్లవారుజామున 4.09 గంటలకు తుది శ్వాస విడిచారు. ఆదివారం అర్ధరాత్రి గుండె పోటుతో ఆ స్పత్రిలో చేరిన ఆయన తదుపరి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల కన్నుమూశా రు. ఈ మేరకు కాంటినెంటల్ హా స్పిటల్ ఎండి గురునాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ “కృష్ణ గుం డెపోటుతో ఆస్పత్రిలో చేరినప్పటి నుంచీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. రెండు, మూడు గం టల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి. డయాలసిస్ చేయడంతో పాటు హైపోక్సిక్ బ్రెయిన్ ఇంజరీకి కూడా చికిత్స అందించాం. అయితే సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది.

ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని తెలిశాక ఆయన ఉన్న కొద్ది గంటలు ప్రశాంతంగా ఉండాలని కుటుంబ సభ్యులతో మాట్లాడి ని ర్ణయం తీసుకున్నాం. మంగళవా రం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృ ష్ణ కన్నుమూశారు” అని అన్నారు. ఇక అభిమానుల సందర్శనార్ధం సూపర్ స్టా ర్ కృష్ణ పా ర్ధివ దేహాన్ని నానక్‌రామ్‌గూడలోని విజయకృ ష్ణ నిల యం వద్ద ఉంచారు. బుధవారం మధ్యా హ్నం తర్వాత ప్రభుత్వ అధికార లాంఛనాల తో మహాప్రస్థానంలో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు జరుగుతా యి. కృష్ణ-, ఇందిరాదేవి దంపతులకు ఐదుగు రు సంతానం. రమేష్ బా బు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల,

ప్రియదర్శిని వారి కుమారులు, కూతుళ్లు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణ ఈ మధ్యనే ఆయన మొదటి భార్య ఇందిరా దేవి మృతిని జీర్ణించుకోలేకపోయారు. సెప్టెంబర్ 28న ఆమె తుది శ్వాస విడిచిన తర్వాత ఆయన మానసికంగా కృంగిపోయారు. ఎంతగానో ప్రేమించే విజయ నిర్మల, పెద్ద కుమారుడు రమేష్ బాబు మృతి, తన స్నేహితుడైన రెబల్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూయడం ఆయనను ఎంతగానో బాధించింది. ఇవన్నీ కృష్ణను మానసికంగా కృంగదీసి ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపించాయి.

350కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన సూపర్‌స్టార్ కృష్ణ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలున్నాయి. తేనెమనసులు (1965) చిత్రంతో పూర్తి స్థాయిలో హీరోగా వెండితెరపై కనిపించిన కృష్ణ చిత్ర పరిశ్రమలో ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ చిత్రం అల్లూరి సీతారామరాజు, మొట్టమొదటి ఈస్ట్‌మన్ కలర్ సినిమా ఈనాడు, తొలి 70ఎంఎం సినిమా సింహాసనం, మొట్టమొదటి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు.. చేసి సూపర్ స్టార్ కృష్ణ ప్రేక్షకుల హృదయాల్లో కథానాయకుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇక దేవదాసు, కురుక్షేత్రం, పాడి పంటలు, పండంటి కాపురం, ముఖ్యమంత్రి, నా పిలుపే ప్రభంజనం, రాజకీయ చదరంగం, సాహసమే నా ఊపిరి తదితర విజయవంతమైన చిత్రాలు ఆయనను తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News