Friday, December 20, 2024

సూపర్‌స్టార్ కృష్ణ బర్త్‌డే కానుకగా…

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కెరీర్ పరంగా వరుసగా సూపర్ సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు. వరుసగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన మహేష్… ఆ తరువాత వచ్చిన ‘సర్కారు వారి పాట’తో కూడా సక్సెస్ సొంతం చేసుకుని సెకండ్ హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కెరీర్‌లో 28వ సినిమా చేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంతో భారీ స్థాయిలో నిర్మితం అవుతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని 2024 జనవరి 13న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అలానే మే 31న సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం రోజున తమ మూవీ నుండి నెక్స్ అప్ డేట్ రానుంది అని కూడా మేకర్స్ తెలిపారు. కాగా విషయం ఏమిటంటే మే 31న మూవీ నుండి సూపర్ అప్‌డేట్ ఖాయం అంటూ తన ట్విట్టర్ అకౌంట్‌లో డ్రమ్స్ ఎమోజి పోస్ట్ చేశారు తమన్. దీంతో అదే రోజున టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ టీజర్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే దీనిపై మాత్రం పక్కాగా యూనిట్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News