సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న రాజమౌళితో అతని సినిమా అప్‌డేట్ రాబోతోందని ఇప్పటికే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ రోజున ఈ మూవీ కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం గోల ఎలా ఉన్నా.. ఇప్పుడు మరో వార్త రాజమౌళి ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇస్తోంది. ఇంతకీ, ఆ వార్త ఏమిటో తెలుసా?, ఈ పాన్ వరల్డ్ సినిమాను రాజమౌళి మూడు భాగాలుగా తెరకెక్కించబోతున్నారని.. మొదటి భాగంలో మహేష్ హీరో కాగా, మిగిలిన భాగాల్లో మరో ఇద్దరు స్టార్స్ నటిస్తారని ఈ వార్త సారాంశం.
గ్రాఫిక్స్ కు అధిక ప్రాధాన్యం ఉన్నందున రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి ఇది నిజమో.. కాదో.. చూడాలి. ఇక తాను ఈ సినిమా మ్యూజిక్ వర్క్ ను ఆగస్టులో ప్రారంభిస్తానని ఎం.ఎం. కీరవాణి చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల ఎంపిక విషయంలో రాజమౌళి టెస్ట్ షూట్స్ చేస్తున్నాడు. అన్నట్టు ఈ సినిమా ఈ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే మహేశ్ వర్క్ షాప్‌కు హాజరవుతుండగా.. అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ నిర్మాణం కూడా జరుగుతోంది.