Monday, January 20, 2025

లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు

- Advertisement -
- Advertisement -

Superstar Mahesh Babu mets Bill Gates

 

‘సర్కారు వారి పాట’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో కలిసి విదేశీ విహార యాత్రలో వున్నారు. యూరప్‌ పర్యటన ముగించుకున్న అనంతరం ఇటీవలే అమెరికాకు షిఫ్ట్ అయ్యారు. బుధవారం ఉదయం మహేష్ బాబు దంపతులు లెజెండరీ బిల్ గేట్స్‌ను కలిశారు. బిల్ గేట్స్‌కి పెద్ద అభిమానైన మహేష్ బాబు ఆయన్ని కలసిన సందర్భంలో థ్రిల్ ఫీలయ్యారు. కోట్లాది మంది అభిమానులు మహేష్‌తో ఫోటోలు తీసుకోడానికి ఆరాటపడగా, సూపర్‌స్టార్ ఫ్యాన్‌ బాయ్‌గా మారి మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడితో ఫోటో దిగారు. ” బిల్‌గేట్స్‌ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికులలో ఆయన ఒకరు. నిజమైన స్ఫూర్తి” అని బిల్ గేట్స్‌తో కలిసి దిగిన ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు మహేష్. ఈ ఫోటో లో మహేష్ సతీమణి నమ్రత కూడా వున్నారు.  మహేష్ బాబు తదుపరి చిత్రం ఎస్ ఎస్ ఎంబి 28 హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News