Friday, December 20, 2024

ఉద్ధవ్ థాక్రేను కలుసుకున్న సూపర్‌స్టార్ రజనీకాంత్

- Advertisement -
- Advertisement -

ముంబై : సూపర్‌స్టార్ రజనీకాంత్ శివసేన (యుబిటి) నేత ఉద్ధవ్ థాక్రేను సబర్బన్ ముంబై లోని ఆయన నివాసంలో శనివారం కలుసుకున్నారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని కేవలం మర్యాద పూర్వకంగానే కలుసుకున్నారని థాక్రే పార్టీ నేత ఒకరు తెలిపారు.

శివసేన సంస్థాపక అధినేత దివంగత బాల్ థాక్రేకు రజనీ గట్టిమద్దతుదారులని ఆయన వివరించారు. థాక్రే భార్య రశ్మి, కుమారులు ఆదిత్య, తేజాలు నటుడు రజనీకాంత్‌కు తమ నివాసం మాతోశ్రీ వద్ద ఘనంగా పుష్పగుచ్ఛం, శాలువాతో స్వాగతం పలికారు. మాతోశ్రీ నివాసానికి రజనీ మళ్లీ రావడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొంటూ ఆదిత్య ట్వీట్ చేశారు.

2010 అక్టోబర్‌లో మాతోశ్రీ నివాసం వద్ద బాల్ థాక్రేను రజనీ కాంత్ కలుసుకున్నారు. 2021 జులైలో తాను ప్రారంభించిన రజనీ మక్కల్ మండ్రం పార్టీని రద్దు చేస్తున్నట్టు , భవిష్యత్తులో తనకు తాను రాజకీయాల్లో చేరాలన్న కోరిక లేనట్టు రజనీ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News