మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి ఫేజ్-2లో భా గంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ పనులను ప్రభు త్వం రద్దు చేసింది. గోదావరి జలాలను కొండ పో చమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు త్రాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం డిజైన్ చేసిన పనులను ప్రభుత్వం విరమించుకుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.2 వేల కోట్లు ఆదా కానుంది. మేఘా ఇంజనీరింగ్ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చే స్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెం ట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీఓ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం తో కేశవాపురం రిజర్వాయర్, అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్లు ఆదా కానున్నాయి. అదే ఖర్చుతో గోదావరి ఫేజ్-2 పథకాన్ని మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హి మాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి,
గ్రేటర్‌కు త్రాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. హైదరాబాద్‌కు 10 టిఎంసీల త్రాగునీటిని సరఫరా చేయడంతో పాటు జంట జలాశయాలకు 5 టిఎంసీల నీటిని అందించేలా మల్లన్న సాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టిఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ పనులకు టెం డర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్‌బోర్డు అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్, అ క్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువును 5 టిఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మిస్తారు. అక్కడి నుం చి ఘన్‌పూర్ మీదుగా హైదరాబాద్‌కు 10 టిఎంసీల త్రాగునీటి అవసరాలకు సరఫరా చేయాల్సి ఉంది. ఆరేళ్లయినా ఈ పనులు ప్రారంభం కాలేదు. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్‌మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు.
గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ మార్గం సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదు. పనులు ఆగిపోయాయి. గత ప్రభుత్వం హయంలో ఈ టెండర్లను దక్కించుకున్న మేఘా కంపెనీ ఈ పనులు చేపట్టకుండా వదిలేసింది. 2017 నాటి ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం పనులు చేపట్టలేమని, 2024 ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం అంచనాలను సవరించాలని మేఘా కంపెనీ ఇటీవలే ప్రభుత్వానికి లేఖ రాసింది. రేట్ల పెంపును తిరస్కరించటంతో పాటు ఇప్పటివరకు పనులు చేపట్టని కారణంగా మేఘా కంపెనీకి కేటాయించిన టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ఖర్చుతో గ్రేటర్ సిటీకి త్రాగునీటి సరఫరాతో పాటు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లో నీటిని నింపేందుకు ఎక్కువ భాగం గ్రావిటీతో వచ్చేలా కొత్త అలైన్‌మైంట్ ప్రకారం పనులు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
మల్లన్నసాగర్‌లో డెడ్ స్టోరేజీ నుంచి నీటిని
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. దీంతోపాటు కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు తగ్గిపోతుంది. అక్కడ ఆదా అయ్యే ఖర్చుతో ఇంతకాలం నిర్యక్షానికి గురైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ రిజర్వాయర్లు పూర్తి స్థాయిలో వినియోగంలోకి వస్తాయి. కొత్త రూట్ ప్రకారం కొండపోచమ్మసాగర్, కేశవపురం జోలికి వెళ్లకుండా అటువైపు దారి మళ్లీంచకుండా నేరుగా
మల్లన్నసాగర్ నుంచి ఘన్‌పూర్ అక్కడి నుంచి హైదరాబాద్ త్రాగునీటికి 10 టిఎంసీలు, జంట జలాశయాలకు మరో 5 టిఎంసీలను పంపింగ్ చేస్తారు. 15 టిఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్‌తో పోలిస్తే 50 టిఎంసీల కెపాసిటీ ఉండే మల్లన్నసాగర్‌లో నీటి లభ్యత ఎక్కువ. స్లూయిస్ లెవెల్ ప్రకారం కొండపోచమ్మ సాగర్‌లో 8టిఎంసీల నీళ్లుంటే తప్ప నీటిని పంపింగ్ చేయడం కుదరదు. అదే మల్లన్నసాగర్‌లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీటిని పంప్ చేసుకునే వీలుంటుంది. అందుకే కొండపోచమ్మసాగర్‌కు బదులుగా నేరుగా మల్లన్నసాగర్‌ను సోర్స్‌గా వాడుకునేలా రాష్ట్ర ప్రభుత్వం పాత ప్రాజెక్టుకు మార్పులు చేసింది.
కొత్త ప్లాన్ ప్రకారం 2 చోట్ల నుంచి పంపింగ్….
పాత ప్రాజెక్టు ప్రకారం హైదరాబాద్‌కు త్రాగునీటిని సరఫరా చేసేందుకు అక్కారం, మర్కూర్, కొండపోచమ్మసాగర్, బొమ్మరాసిపేట, ఘన్‌పూర్ వద్ద మొత్తం 5 చోట్ల నీటిని పంపింగ్ చేయాల్సి ఉంటుంది. కొత్త ప్లాన్ ప్రకారం మల్లన్నసాగర్, ఘన్‌పూర్ కేవలం 2 చోట్ల నీటిని పంపింగ్ చేస్తే సరిపోతుంది. అయిదు చోట్ల పంపింగ్ చేసే బదులు 2 చోట్ల పంపింగ్ చేయటం, మిగతా చోట్ల గ్రావిటీతో నీటి సరఫరా జరిగే వీలుంది. దీంతో ఖర్చుతో పాటు ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ భారం తగ్గుతుంది. అంతమేరకు కరెంటు ఛార్జీల భారం కూడా తగ్గుతుంది. పాత ప్రాజెక్టులో పైపులైన్ పొడవు కేవలం 71.9 కిలోమీటర్లు.
ఇప్పుడు ఉస్మాన్‌సాగర్ వరకు దాదాపు రూ.162 కిలోమీటర్ల మేరకు ప్రాజెక్టును పొడిగించనుంది. దీంతో గ్రేటర్ సిటీ విస్తరణకు అనుగుణంగా ప్రజల త్రాగునీటి అవసరాలు తీరనున్నాయి. ఇప్పుడు గోదావరి, కృష్ణా నుంచి హైదరాబాద్ త్రాగునీటికి అందిస్తున్న ఖర్చు ఒక కిలో లీటర్ ఫర్ డే కు రూ.48ల వరకు ఖర్చు అవుతోంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒక కేఎల్డీకి కేవలం రూ.4లు మాత్రమే ఖర్చవుతుంది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లో గోదావరి జలాలను నింపాలన్న రాష్ట్ర ప్రభుత్వ భారీ సంకల్పం నెరవేరనుంది.