Friday, December 20, 2024

వందశాతం సబ్సీడితో చిరు సంచుల(మినికిట్స్)సరఫరా

- Advertisement -
- Advertisement -

జహీరాబాద్: పప్పు దినుసుల సాగు, నూనెగింజల, చిరుధాన్యాల సాగు ప్రోత్సహకంలో భాగంగా ఈ వానాకాలంలో వందశాతం సబ్సీడితో చిరు సంచులు(మినికిట్స్)సరఫరా డివిజన్ వ్యాప్తంగా చేయడం జరిగిందని సహాయ వ్యవసాయ సంచాలకులు బిక్షపతి తెలిపారు. మండలంలోని హోతి-కే గ్రామంలో గ్రామంలో రైతులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నూతన చిరు సంచుల రకాలను మంచి యజమాన్య పద్దతులు పాటించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాదించవచ్చని తెలిపారు.

రైతు స్థాయిలో మిగతా రైతులకు ఇచ్చి వచ్చే వానాకాలంలో విత్తుకోవచ్చని తెలిపారు. డివిజన్ వ్యాప్తంగా సోయాబిన్(డిబిఎస్-1) అనే నూతన చిరుసంచులు 49.2 క్వింటాల్లు కేటాయించడం జరిగింది. అలాగే మినుము(జిబిజి-1)అనే రకాన్ని డివిజన్‌కి 71 క్వింటాళ్లు కేటాయించినట్లు తెలిపారు. చిరుదాన్యాల ప్రోత్సహకంలో బాగంగా రాగి (విల్-376)అనే నూతన రకం డివిజన్‌కి 1 క్వింటాల్ కేటాయిండం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారి వీరేందర్, రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News