Tuesday, November 5, 2024

ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

Supply of Oxygen tankers to states by Railway Department

పరుగులు తీయనున్న ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్’ రైళ్లు

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్‌లో రూపాంతరం చెందిన కరోనా వైరస్ ప్రమాదకరం అని నిపుణులు పేర్కొంటున్న నేపథ్యంలో ఆసుపత్రుల పాలవుతున్న వారి సంఖ్య నానాటికి రెట్టింపవుతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల బెడ్ల కొరత, ఆక్సిజన్‌కు డిమాండ్ ఏర్పడుతున్నాయి. అనేక రాష్ట్రాలు ఆక్సిజన్ లభ్యత లేక కేంద్రానికి మొరపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రత్యేకంగా ప్రాణవాయువు తరలిపు కోసం ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలని కేంద్రం రైల్వే శాఖను కోరింది. ద్రవరూప ఆక్సిజన్‌ను రైళ్ల ద్వారా తరలించే వెసులుబాటు ఉంటే వెంటనే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. దాంతో రైల్వే శాఖ పలు మార్గాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో ట్రయల్ రన్ చేపట్టింది. ఇది విజయవంతం కావడంతో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు నడపాలని నిర్ణయించారు. ఈ రైళ్లు వేగంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణించే మార్గంలో ఎలాంటి ఆటంకాలు, నిలుపుదలలు లేకుండా చర్యలు తీసుకోనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News