Tuesday, September 17, 2024

వేగవంతంగా బియ్యాన్ని అప్పగించాలి

- Advertisement -
- Advertisement -
ధాన్యం అమ్మినా, కొన్నా కఠిన చర్యలు
రైస్ మిల్లర్ల సమీక్షలో చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మిల్లర్లను హెచ్చరించారు. శనివారం నాడు పౌరసరఫరాల భవన్‌లో కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. సీఎంఆర్‌ను వేగవంతం చేయడానికి ప్రతి జిల్లా రైస్ మిల్లర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) కోసం రైస్ మిల్లర్లకు పౌర సరఫరాల సంస్థ కేటాయించిన ధాన్యాన్ని మిల్లర్లు అమ్ముకున్న, ఎవరైనా కొనుగోలు చేసినా నేరమేనని అమ్మిన, కొనుగోలు చేసిన ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ప్రకటించారు.

రైస్ మిల్లర్ల నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణలో మరింత కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో అదే స్థాయిలో సీఎంఆర్ సేకరణలో కూడా ప్రదర్శించాలని సూచించారు. సీఎంఆర్‌లో జాప్యం జరగడం వల్ల సంస్థపై వడ్డీ భారం పెరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు రైతు బందు, రైతు భీమా, ఉచిత కరెంటు కొత్తగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల వల్ల తెలగాణ రాష్ట్రంలో గణనీయంగా ధాన్యం దిగుబడి, కొనుగోళ్లు పెరిగాయని తెలిపారు.

ఒక తెలంగాణ రాష్ట్రం మినహా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా రాష్ట్రంలో పండిన పంటలో పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదన్నారు. ఒకనాడు రైస్ మిల్లర్లు రైస్ మిల్లును నడపలేక రేకులు అమ్ముకునే స్టేజ్ నుంచి ముఖ్యమంత్రి చర్యల వల్ల కొత్తగా రైస్ మిల్లును ఏర్పాటు చేసే స్టేజ్‌కి ఎదిగారని అన్నారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు బియ్యం కావాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అడుగుతున్నాయంటే , వరి ధాన్యం దిగుబడిలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి ఏమిటో దీన్ని బట్టి అర్థమవుతుందని చైర్మన్ రవీందర్ సింగ్ పేర్కొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News