Monday, December 23, 2024

ఉచిత విద్యుత్ సాధ్యమే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ రంగానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేయడం సాధ్యమేనని విద్యుత్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే విద్యుత్ వ్యవస్థలో కేం ద్రం అనుసరిస్తున్న కొన్ని తప్పుడు వి ధానాలకు స్వస్తి చెబితే తెలంగాణ స కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీని నెరవేర్చడం ఇటీవల జరిగిన ఓ సభలో ముఖ్యమం త్రి కెసిఆర్ మాట్లాడుతూ కేంద్రంలో త మ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసా య రంగానికి ఉచితంగా నాణ్యమైన వి ద్యుత్‌ను సరఫరా చేస్తామని, అదే వి ధంగా దేశవ్యాప్తంగా ఉన్న దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి దళితబంధు పథకాన్ని కూడా అమలు చేస్తామని ఇచ్చిన ణౌమీలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. ఈ రెండు పథకాల అమలు సాధ్యాసాధ్యాలపై చర్చోపచర్చలు జరుగుతున్నా యి.

ఈ నేపథ్యంలో జాతీయస్థాయిలో ని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యుత్‌రంగ నిపుణులు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ పథకం అమలు తీరు తెన్నులను అడిగి తెలుసుకుంటున్నారు. దేశంలో 39 కోట్ల 46 లక్షల ఎ కరాల వ్యవసాయ భూములున్నాయ ని, అందులో కేవలం 21 కోట్ల 56 లక్షల
ఎకరాలకు మాత్రమే నీటిపారుదల సదుపాయాలు ఉన్నాయి. మరో 18 కోట్ల ఎకరాలకు సాగునీటి వసతిలేక కేవలం వరుణదేవుడి కరుణాకటాక్షం కోసం ఆకాశంవైపు చూస్తూ వర్షాలను నమ్ముకొని పంటలను పండిస్తున్నారని, ఇలాంటి రైతాంగానికి ఖచ్చితమైన సాగునీటి వసతులను కల్పిస్తే వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతాయని, తద్వారా దేశానికే కాకుండా ప్రపంచంలోని సగం దేశాలకు ఆహారధాన్యాలను ఎగుమతి చేసే సామర్ధం భారతీయ రైతాంగానికి ఉందని ఆ నిపుణులు అంటున్నారు.

దేశవ్యాప్తంగా 2.10 కోట్ల వ్యవసాయ పంప్‌సెట్లకు విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయని, ఈ విద్యుత్తు కనెక్షన్లకు కేవలం 45 వేల మెగావాట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తున్నారని వివరించారు. దేశవాయప్తంగా ప్రస్తుతం 4,04,133 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి స్థాపిత సామర్ధం ఉందని, అందులో రోజుకు సగటున అన్ని రంగాలకు కలిపి 2.15 లక్షల మెగావాట్ల విద్యుత్తును మాత్రమే వినియోగిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ రంగానికి వినియోగిస్తున్న 45 వేల మెగావాట్ల విద్యుత్తును ఉచితంగా రైతులకు అందించాలంటే 2.70 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని విద్యుత్తురంగ నిపుణులు వివరించారు. అంతేగాక కేంద్ర ప్రభుత్వ ఖజానాలో సుమారు 27 లక్షల కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయని, సెస్-సర్‌చార్జీల రూపంలో దేశ ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్మేనని, ఆ నిధుల్లో 10శాతం డబ్బును రైతాంగానికి ఉచిత విద్యుత్తు కోసం ఖర్చు చేస్తే యావత్తు దేశంలో వ్యవసాయ రంగానికి మేలుచేసినట్లవుతుందని వివరించారు.

విద్యుత్తు ఉత్పత్తికి ప్రస్తుతం ఉన్న ఖర్చులను కూడా భారీగా తగ్గించుకోవచ్చునని, కరెంటు ఉత్పత్తికి అయ్యే ఖర్చులు తగ్గితే సహజంగా ఉచిత విద్యుత్తుకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే నిధులు కూడా తగ్గుతాయని వివరించారు. ఒకవైపు విద్యుత్తు ఉత్పత్తి సామర్దాన్ని పెంచుకొంటూనే మరో వైపు ఉత్పత్తికి అయ్యే ఖర్చులను కూడా తగ్గించుకొంటే రైతాంగానికి నాణ్యమైన విద్యుత్తును పంటలకు అందించవచ్చునని అంటున్నారు. విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాన్ని 4.04 లక్షల మెగావాట్ల నుంచి 6.50 లక్షల మెగావాట్లకు పెంచుకోవడానికి ఆచరణయోగ్యమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని, తద్వారా వ్యవసాయ రంగానికి మొత్తం ఒక లక్ష మెగావాట్ల కరెంటును సరఫరా చేసే స్థితికి చేరుకోవాలని సూచించారు. అందుకు తగినట్లుగా దేశంలో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి సంస్థలు, జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, గ్యాస్ ఆథారిత విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలు, సోలార్ విద్యుత్తు రంగాలను భారీగా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు.

దేశంలో రానున్న 112 సంవత్సరాలకు సరిపడా బొగ్గు నిల్వలు ఉన్నాయని, దిగుమతి చేసుకునే బొగ్గుపై ఎక్కువగా ఆధారపడకుండా రానున్న 15 సంవత్సరాల వరకూ దేశవాళీ బొగ్గునే థర్మల్ విద్యుత్తు కేంద్రాలకు వాడుకుంటే నిర్దేశించుకొన్న అభివృద్ధిని సాధించుకోవచ్చునని అంటున్నారు. అంతేగాక దేశవాళీ బొగ్గు ఒక టన్నుకు మూడు వేల రూపాయలకే లభిస్తోందని, ఒకవేళ ప్రస్తుతం బొగ్గు తవ్వకాలు, రవాణాచార్జీలు పెరిగాయని అనుకొన్నా ఒక టన్నుకు 6,500 రూపాయలకు మించదని తెలిపారు. కానీ అదే కేంద్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడైన అదానీ కంపెనీల నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సి వస్తే ఒక టన్నుకు ఏకంగా 30 వేల రూపాయలను చెల్లించాల్సి ఉంటుందని, ఇంతటి భారీ మొత్తాల్లో బొగ్గును కొనుగోలు చేసి కరెంటును ఉత్పత్తి చేసుకొని వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తును సరఫరా చేయడం కష్టమవుతుందని, అందుచేతనే అదానీ బొగ్గును కొనుగోలు చేయకుండా దేశవాళీ బొగ్గును వినియోగిస్తే విద్యుత్తు ఉత్పత్తి ఖర్చుల్లో 50 శాతం ఆదా అవుతుందని, తద్వారా యూనిట్ విద్యుత్తు ధర నాలుగు రూపాయలకే లభిస్తుందని నిపుణులు వివరించారు.

అందుకేనేమో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశవాళీ బొగ్గునే కొనుగోలు చేసుకొంటూ అదానీ బొగ్గును వద్దంటే వద్దని తెగేసి చెప్పారని, ఈ విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చినట్లుగా ఉందని ఆ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందని, అంతేగాక తెలంగాణ బాటలోనే తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాలు అదానీ (దిగుమతి) బొగ్గును కొనుగోలు చేయడానికి తీవ్రంగా వ్యవతిరేకించాయని, ఇప్పటికీ ఈ రాష్ట్రాలు అదాని బొగ్గును తీసుకోవడంలేదని వివరించారు.మొదట్లో బిజెపి పాలిత రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ కూడా అదానీ బొగ్గును తీసుకోవడానికి వ్యతిరేకించిందని, కాకుంటే కేంద్రంలోని పెద్దల వత్తిళ్ళకు తలొగ్గి ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం కూడా అదానీ బొగ్గును తీసుకొంటోందని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి ఖర్చులు పెరిగాయని తెలిపారు.

అందుకే థర్మల్ విద్యుత్తు రంగంలో ఎదుగుదల తక్కువగా ఉందని, కానీ దేశంలో పుష్కలంగా నదీ జలాలు ఉన్నాయని, దేశంలోని 405 నదుల్లో కలిపి మొత్తం 72 వేల టి.ఎం.సి.ల నీరుందని, ఈ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించుకొంటే గ్రావిటీ కాల్వలతో పంట పొలాలకు నీటిని సరఫరా చేయడమే కాకుండా జల విద్యుత్తును కూడా కనీసం మరో 1.50 లక్షల మెగావాట్ల ఉత్పత్తిని పెంచుకోవచ్చునని అంటున్నారు. ఇంకా గ్యాస్ ఆధారిత విద్యుత్తును, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, సోలార్, పవన విద్యుత్తు తదితర రంగాల్లో కూడా కరెంటును 6.5 లక్షల మెగావాట్ల ఉత్పత్తి సామర్ధానికి పెంచుకుంటే దేశంలో విద్యుత్తు సమస్యలు తగ్గుతాయని సూచిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ విద్యుత్తు ఉత్పత్తి సామర్ధాలను పెంచుకొని, ఖర్చులు తగ్గించుకునే మార్గాలతో నిర్ధిష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొంటే ముఖ్యమంత్రి కె.సి.ఆర్. దేశ ప్రజలకు ఇచ్చిన హామీ తప్పకుండా నెరవేర్చవచ్చునని నిపుణులు గట్టిగా చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News