Friday, December 27, 2024

తెలంగాణలో అభివృద్ది, సుస్థిర పాలనకే మద్దతు

- Advertisement -
- Advertisement -

సెటిలర్లం కాదు ..తెలంగాణీయులమే
ఆంధ్రావేరు, రాయలసీమ వేరు
గ్రాట్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సుస్థిరతలకు కట్టుబడి ఉన్న పార్టీకే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓటు వేస్తామని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(గ్రాట్) ప్రకటించింది. ఆదివారం హైదరాబాద్‌లోని గ్రాట్ ప్రధాన కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు విశ్రాంత డిఐజి ఏ.హనుమంతరెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు తెలపాలన్న అంశంపై సమావేశంలో సుధీర్గంగా చర్చించారు.సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గ్రాట్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు ,నంద్యాల, కడప, అన్నమయ్య , తిరుపతి, చిత్తూరు, అనంతపురం , పుట్టపర్తి , నెల్లూరు,ప్రకాశం జిల్లాల నుంచి విద్య, ఉద్యోగ, వ్యాపార ఉపాధి అవసరాల రీత్యా వచ్చి తెలంగాణ ప్రాంతంలో స్థిరపడిన వారి సంఖ్య 15లక్షలకు పైగానే ఉందని తెలిపారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుద్భుల్లాపూర్, మేడ్చెల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్ , సనత్ నగర్, జూబ్లీహిల్స్ , ఉప్పల్, అంబర్‌పేట, ముషీరాబాద్, నాంపల్లి, రాజేంద్రనగర్ ,సికింద్రాబాద్ కంటోన్మెంట్ నిజయోకవర్గాల్లో అధికంగా ఉన్నట్టు తెలిపారు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, మెదక్ ,నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో కూడా చాలా మంది వివిధ వృత్తులతోపాటు ఉద్యోగ ,వ్యాపారల్లో స్థిరపడి ఉన్నారని తెలిపారు. రాష్ట్రం విడిపోయాక ఇక్కడ తామందరం అన్నదమ్ముల్లాగా కలిసి మెలసి జీవిస్తు నిమ్మళంగా ఉన్నామన్నారు.

సీమాంధ్ర సెటిలర్ల పేరుతో ఆంధ్రాపాంతానికి చెందిన ఒక వర్గం వారు కులాల పంచాయతీతో ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని , అటువంటి వారికి తాము పూర్తిగా వ్యతిరేకం అని తెలిపారు. ఆంధ్రాకు , రాయలసీమ ప్రాంతానికి చాలా తేడా ఉందన్నారు. తాము సెటిలర్లము కామని ,తాము కూడా తెలంగాణీయులమే అని స్పష్టం చేశారు. ఇక్కడ తామంతా ప్రశాంతంగా జీవిస్తున్నామని ఇటువంటి వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నించవద్దని ఆంధ్రాప్రాంత సెటిలర్లను హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నగ్రాట్ అవసరాలను కూడా రాజకీయ పార్టీలు గుర్తించాలని కోరారు. ఎంతో కాలంగా తాము గ్రాట్ కార్యకలాపాల నిర్వహణకోసం శాశ్విత ప్రాతిపదికన భవనం నిర్మించాలని నిర్ణయించామని ఇందుకోసం ప్రభుత్వాలు సహకరించాలని కోరారు. తెలంగాణ సత్వారాభివృద్ధి, సుస్థిర పాలనకే గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మద్దుతు ఇస్తుందని అటువంటి పార్టీ కే ఎన్నికల్లో ఓట్లు వేసి గెలిపించాలని సమావేశంలో నిర్ణయించినట్టు గ్రాట్ అధ్యక్షుడు హనుమంతరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో గ్రాట్ ప్రధానకార్యదర్శి రాఘవతోపాటు ముఖ్యనేతలు బద్రీనాథ్ ,నిరంజన్ దేశాయ్ , చంద్రశేఖర్ రెడ్డి, కులేశ్వరర్ రెడ్డి, రాజేశ్ , రాజేశేఖర్ ,రామకృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News