Sunday, December 22, 2024

జిపి కార్మికుల దీక్షలకు మద్దతు

- Advertisement -
- Advertisement -

ములకలపల్లి : రాష్ట్ర జెఎసి పిలుపులో భాగంగా మండలంలోని 20 గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న కార్మికులు గత అయిదు రోజులుగా చేస్తున్న రిలే నిరహర దీక్షలకు జిల్లా కాంగ్రేస్ పార్టీ నాయకురాలు వగ్గెల పూజ తమ మద్దతును తెలిపారు. సోమవారం వగ్గెల పూజ మండల కాంగ్రేస్ పార్టీ నాయకులతో కలిసి దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి మద్దతు తెలిపారు.దీక్షా శిబిరం వద్ద కార్మికులు ఏర్పాటు చేసిన వంటా వార్పు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కనీస వేతన చట్టం ప్రకారం కార్మికులకు ప్రభుత్వం వేతనాలను చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేసారు.దీక్షా శిబిరాన్ని కాంగ్రేస్‌పార్టీ మండల నాయకులు బుగ్గారపు సత్యనారాయణ, ఖాధర్‌బాబా, కొప్పుల రాంబాబు, కుంజా వెంకట్, జహీర్, అచ్చన వెంకటేశ్వర్లు, బూరుగుపల్లి పద్మశ్రీ, వాడే లక్ష్మి, బానోత్ అమర్‌సింగ్, పాలకుర్తి రవి, కోండ్రు భాస్కర్, మడకం శ్రీనివాస్, భూక్యా శివ, ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News