Thursday, December 12, 2024

కూటమిలో కుంపట్లు

- Advertisement -
- Advertisement -

‘ఇండియా’కు మమత
సారథ్యం వహించాలంటూ
పెరుగుతున్న డిమాండ్
తాజాగా గొంతు కలిపిన
లాలూప్రసాద్ కాంగ్రెస్
వ్యతిరేకతను తేలికగా
కొట్టిపడేసిన ఆర్‌జెడి నేత
శివసేన(ఉద్దవ్)దీ అదే
మాట కాంగ్రెస్ మినహా
ఎవరైనా ఓకే : సంజయ్ రౌత్

పాట్నా/ న్యూఢిల్లీ : ఇండియా కూటమికి సారథ్యం వహించేందుకు తాను సిద్ధమని ప శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించిన తరువాత ఆమెకు మద్దతుగా వివిధ నేతలు మాట్లాడసాగారు. తాజాగా రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) అధిపతి లాలూ ప్రసాద్ యాదవ్ వారికి వం త పాడారు. మమతా బెనర్జీని ఇండియా కూటమికి నాయకత్వం వహించనివ్వాలని లాలూ మంగళవారం స్పష్టం చేశారు. ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాయకురాలుగా మమతను అంగీకరించడం గురించి ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షం కాంగ్రెస్‌కు ఏమైనా వ్యతిరేకత ఉన్నా అది ‘ఏమాత్రం తేడాచూపదు’ అని కూడా లాలూ అన్నారు. ‘మమతా బెనర్జీని ఇండియా కూటమికి నేతృత్వం వహించేందుకు అ నుమతించాలి’ అని ఆర్‌జెడి చీఫ్ సూచించారు. ప్రతిపక్ష కూటమి నాయకురాలిగా ఆ మెను అం గీకరించేందుకు కాంగ్రెస్‌కు ‘రిజర్వేషన్’ ఉండవచ్చా అన్న ప్రశ్నకు ‘కాంగ్రె స్ అభ్యంతరం ఉన్నా లేకపోయినా ఒకటే.

ఆమెను ఇండియా కూటమికి నాయకత్వం వహించనివ్వాలి’ అని లాలూ సమాధానం ఇచ్చారు. లాలూ వ్యాఖ్యకు శివసేన (యుబిటి) నేత సంజయ్ రౌత్ స్పందిస్తూ, కాంగ్రెస్ కాకుండా వేరే ఎవరైనా ఇండియా కూటమికి సారథ్యం వహించే విషయమై చర్చించేందుకు తమ పార్టీ సుముఖమేనని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఏర్పాటైన ప్రతిపక్ష కూటమికి ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నారు. రాజ్యసభ సభ్యుడైన రౌత్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, ఖర్గే, రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నాయకత్వంతో తమ పార్టీ సంబంధాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు.కాంగ్రెస్ జాతీయ పార్టీ అని, ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల్లో అత్యధిక సంఖ్యాక ఎంపిలు ఆ పార్టీకి ఉన్నారని రౌత్ చెప్పారు. ‘అయినప్పటికీ ఇండియా కూటమిని మళ్లీ పటిష్ఠం చేయవలసి ఉన్నట్లయితే, కూటమికి సమయం ఇవ్వగల వారికి& మమతా బెనర్జీ, ఉద్ధవ్ ఠాక్రే, లాలూ ప్రసాద్ యాదవ్,

శరద్ పవార్ లేదా అఖిలేశ్ యాదవ్‌కు నాయకత్వం ఇవ్వడం గురించి చర్చించాలని ప్రతి ఒక్కరూ అభిలషిస్తున్నారు’ అని రౌత్ చెప్పారు. కూటమిలో ఇంకా భాగం కాని బిజూ జనతా దళ్ (బిజెడి) అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కూడా ఇండియా కూటమిలో చేరగలరని ఆయన సూచించారు. ‘మేము ఈ అంశంపై పరస్పరం మాట్లాడుకుంటున్నాం’ అని రౌత్ తెలిపారు. అంతకుముందు లాలూ కుమారుడు, ఆర్‌జెడి సీనియర్ నేత తేజస్వి యాదవ్ ఇండియా కూటమికి సారథ్యం వహించేందుకు మమతతో సహా ఏ సీనియర్ నేత విషయంలోనైనా తనకు అభ్యంతరంఏమీ లేదని, అయితే, ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News