Thursday, January 23, 2025

జొన్నరైతుకు మంచి రోజులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్ర భు త్వం కనీస మద్దతు ధరలకు రైతుల నుంచి జొన్నలు కొనుగోలు చేసేందుకు నిర్ణయం తీ సుకుంది. క్వింటాలుకు రూ.3180 చెల్లించనుంది. మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనుంది. అంతే కాకుండా ఎకరానికి పంట ది గుబడికి సంబంధించిన ఇదివరకటి నిబంధనలు కూడా సడలించింది. గత ఐదేళ్లుగా పం ట దిగుబడుల ఆధారంగా ఎకరానికి 8.85 క్వింటాళ్లను మాత్రమే రైతులనుంచి కొనుగో లు చేసేందుకు పరిమితలను అమలు చేస్తూ వచ్చింది. అయితే ఇటీవలి కాలంలో పంట దిగుబడులు పెరుగుతూ వస్తున్నాయి.

ఆదిలాబాద్ , నిజామాబాద్, నిర్మల్ తదితర జిల్లాల్లో రబి జొన్న దిగుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం పంట కొనుగోళ్ల పరిమితిని కూడా పెంచాలని రైతుల చేస్తున్న విజ్ణప్తులకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఎకరానికి 12క్వింటాళ్ల వరకు కొనుగోలు పరిమితిని పెంచింది. రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా జొన్నల కొనుగోలుకు చర్యలు చేపట్టింది. రైతులు తొందరపడి తక్కువ ధరలకు జొన్నలను ప్రైవేటు వ్యాపారులకు విక్రయంచి నష్టపోరాదని సూచించింది. మార్క్‌ఫెడ్ ద్వారా ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాల్లో జొన్నలను కనీస మద్దతు ధరకు విక్రయించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ణప్తి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News