Monday, December 23, 2024

కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటా

- Advertisement -
- Advertisement -

 

మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలోని బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ పరంగా, ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని భూత్పూరు బిఆర్‌ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు రాఘవేంద్రరెడ్డి భార్య సువర్ణ గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం బుధవారం భూత్పూరుకు చేరుకొని సువర్ణ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట మహిపాల్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, పారేవుల రవీందర్‌రెడ్డి, కె.ఎల్లారెడ్డి, కుర్మయ్యగౌడ్, చెన్నయ్యగౌడ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News