Monday, December 23, 2024

వరద బాధితులకు అండగా నిలవండి

- Advertisement -
- Advertisement -

బాధితులకు తోచిన సహాయం చేయండి
టెలికాన్ఫరెన్స్‌లో టిడిపి పార్లమెంటు అధ్యక్షులతో కాసాని
ప్రాణ, పంట నష్టంపై జిల్లాల వారీగా వివరాల సేకరణ

హైదరాబాద్ : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను అన్నివిధాలా ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారికి సహాయ, పునరావాసం అందించాలని సూచించారు. శుక్రవారం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులతో కాసాని జ్ఞానేశ్వర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా అన్ని జిల్లాల వారీగా వరద, పంట నష్టం వివరాలను జిల్లాల వారిగా అడిగి తెలుసుకున్నారు. గత ఐదు ఆరు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి పరివాహాక జిల్లాల్లో అల్లకల్లోలంగా మారాయన్నారు. భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎక్కువగా గోదావరి పరివాహక ప్రాంతంలోని జిల్లాల్లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రభుత్వం వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించి అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంలో ప్రభుత్వం దిగివచ్చేవరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పార్లమెంటు అధ్యక్షులకు జ్ఞానేశ్వర్ సూచించారు. కాగా సహాయ,పునరావాస చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ముఖ్యంగా వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అవరమైన సహాయం అందజేయాలని పార్టీ కేడర్ కు కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వర్షాల కారణంగా బయటకు వెళ్లలేని ప్రజలను, ముఖ్యంగా దినసరి కూలీలను ఆదుకోవడానికి వారికి భోజనం, తాత్కాలిక నివాస వసతులు కల్పించాలని ప్రభుత్వానికి కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టపోయిన ఆస్తి నష్టాన్ని అంచనా వేసి, వరదలో చిక్కుకున్న ప్రజల సహాయ సహకారాలు అందించడంలో ముందుండాలని టిడిపి శ్రేణులను ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన వరద బాధితులకు యుద్ధప్రాతిపదికన సాయం చేయాలని సూచించారు. ఈ మేరకు సహాయ, పునరావాస చర్యల్లో ముమ్మరంగా పాలుపంచుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులను కాసాని జ్ఞానేశ్వర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర నాయకులు షేక్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News