Thursday, January 23, 2025

పోలీస్‌లతో అమృత్‌పాల్ మద్దతుదార్ల బాహాబాహి

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే గ్రూప్ చీఫ్ అమృత్‌పాల్ సింగ్ మద్దతుదారులు కత్తులు, ఆయుధాలు పట్టుకుని గురువారం పోలీసులతో ఘర్షణ పడ్డారు. తమ కార్యకర్తను 24 గంటల్లో విడుదల చేయాలని పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలోని పోలీస్ కాంప్లెక్స్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. నిరసనల మధ్య ఆరుగురు పోలీసులు గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.

అమృత్‌పాల్ సింగ్ సహాయకురాలు లవ్‌ప్రీత్ తుఫాన్‌కు వ్యతిరేకంగా అజ్నాలా పట్టణంలో నిరసనకారులు ప్రదర్శన నిర్వహించారు. ఇదిలావుండగా ఉద్రిక్తతను తగ్గించడానికి, పరిస్థితి సున్నితంగా ఉండడంతో ‘లవ్‌ప్రీత్ తుఫాన్ నిర్దోషి, నిరసనకారులు తగిన రుజువు చేశారు’ అని పోలీస్ కమిషనర్ జస్కరన్ సింగ్ మీడియాతో అన్నారు. ‘సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) దీనిని గమనించింది. వీరు శాంతియుతంగా చెదరగొట్టబడతారు. చట్టం తన పనిని తాను చేసుకుపోతుంది’ అన్నారు.
రోపర్ జిల్లాలోని చమ్‌కౌర్ సాహిబ్ నివాసిని కిడ్నాప్ చేసి కొట్టినందుకు అమృత్‌పాల్ సింగ్, ఆయన మద్దతుదారులపై కేసు నమోదయింది. సోషల్ మీడియాలో షేర్ చేయబడిన వీడియోలు, ఫోటోలు పోలీస్ స్టేషన్ వెలుపల నిరసనకారుల గుంపును చూపించాయి. అయితే పోలీసులు జనాన్ని నియంత్రించడానికి ప్రయత్నించారు.

‘కేవలం రాజకీయ ఉద్దేశ్యంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. గంటలో కేసును రద్దు చేయకపోతే, తదుపరి ఏమి జరిగినా దానికి అడ్మిన్‌స్ట్రేషన్ బాధ్యత వహిస్తుంది’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెదిరింపు జారీ చేసిన అమృత్‌పాల్ సింగ్, ఆయనకు కూడా ఇందిరా గాంధీకి పట్టిన అదే గతి పడుతుందని అన్నారు. ‘వారిస్ పంజాబ్ దే’ అనేది గత ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కార్యకర్త దీప్ సిద్దూ స్థాపించిన ర్యాడికల్స్ సంస్థ.

Sikhs 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News