Wednesday, January 22, 2025

పతంజలి వ్యాపార ప్రకటనలపై చర్యలు ఎందుకు లేవు?

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: పతంజలి ఆయుర్వేద లిమిటెడ్‌కు సంబంధించిన తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో చర్యలు తీసుకోనందుకు ఉత్తరాఖండ్ రాష్ట్ర తైసెన్సింగ్ అథారిటీని సుప్రీంకోర్టు మంగళవారం తీవ్రంగా మందలించింది. సంస్థ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసిన జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ఏప్రిల్ 19న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసిన తర్వాత లైసెన్సింగ్ అథారిటీ నుంచి చర్యలు మొదలైనట్లు కనపడుతోందని పేర్కొంది.

మీ పట్ల సానుభూతి కలగాలంటే నిజాయితీగా మాట్లాడండి అంటూ లైసెన్సింగ్ అథారిటీని ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో లైసెన్సింగ్ అథారిటీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుందా లేదా అన్నదే తమ ప్రధాన ప్రశ్న అని ధర్మాసనం తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణను మే 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది. ఏప్రిల్ 10న ఈ కేసు విచారణ సందర్భంగా పతంజలి ఆయుర్వేద సంస్థపై ఉత్తరాఖండ్ రాష్ట్ర లైసెన్సింగ్ అథారిటీ చర్యలు తీసుకోనందుకు ధర్మాసనం ఆక్షేపణ తెలియచేసింది.

ఉద్దేశపూర్వకంగానే కళ్లు మూసుకున్న లైసెన్సింగ్ అథారిటీని ఊరికే వదలిపెట్టబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా..యోగాగురు రాందేవ్‌కు చెందిన పతంజలి ఫార్మసీ కంపెనీలు తయారుచేస్తున్న 14 ఉత్పత్తుల తయారీ లైసెన్సులను ఉత్తరాఖండ్ ఔషధ నియంత్రణా సంస్థ సోమవారం సస్పెండ్ చేసింది. ఆ మందుల సామర్ధం గురించి పదేపదే తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనలు ప్రచురిస్తున్నందుకు వాటి తయారీ లైసెన్సులను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వులో పేర్కొంది. లైసెన్సులు సస్పెండ్ చేసిన మందులలో ఆస్తమా, బ్రాంకటీస్, డయాబెటీస్ కోసం బాబా రాందేవ్ కంపెనీ తయారు చేసే సాంప్రదాయక మందులు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News