Sunday, January 19, 2025

ఎన్నికల బాండ్ల అంశంలో ఎస్‌బిఐ తీరుపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఎన్నికల బాండ్ల అంశంలో ఎస్‌బిఐ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాండ్ల వివరాల వెల్లడికి గడువు పొడిగించాలని ఎస్‌బిఐ అభ్యర్థించింది. 26 రోజులుగా ఏం చేశారని ఎస్‌బిఐని సుప్రీం ప్రశ్నించింది. మార్చి 12లోగా విరాళాల వివరాలు వెల్లడించాలని ఎస్‌బిఐకి వివరణ ఇచ్చింది. మార్చి 15 సాయంత్రం 5 గంటల్లోగా ఎన్నికల బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని ఇసికి అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి జూన్ 30 వరకు గడువు పొడిగించాలని ఎస్‌బిఐ దాఖలు చేసిన పిటిషిన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నెలరోజుల క్రితం చరిత్రాత్మక తీర్పును ఇచ్చిన విషయం తెలిసిందే.  విరాళాల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచడం చెల్లదని, ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, సమాచార హక్కు చట్ట ఉల్లంఘన తక్షణమే పథకాన్ని రద్దు చేయాలి ఉన్నత న్యాయం స్థానం పార్టీలకు సూచించింది.  నగదుగా మార్చుకోని బాండ్లను పార్టీలు వాపస్ చేయాలని, మార్చి 6లోగా బాండ్ల వివరాలు ఎస్‌బిఐ సమర్పించాలని, మార్చి13లోగా పూర్తి వివరాలను ఇసి వెబ్‌సైట్‌లో పెట్టాలని సుప్రీం సూచించిన విషయం విధితమే.

గతంలో తాము స్వీకరించిన విరాళాలు, స్వీకరించబోయే విరాళాలకు సంబంధించిన వివరాలను రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్‌లో ఇసిఐకి సమర్పించాలని ఆ ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తాజాగా ఎన్నికల బాండ్ల పథకాన్ని రద్దుచేసిన 15 రోజుల చెల్లుబాటు గడువు మాత్రమే ఉండే ఎన్నికల బాండ్లను రాజకీయ పార్టీలు ఇంకా తమ ఖాతాలలో జమచేయని పక్షంలో సంబంధిత బ్యాంకుకు వాటిని వాపసు చేయాలని, ఆ సొమ్ము మొత్తాన్ని సంబంధిత కొనుగోలుదారుడి ఖాతాలో బ్యాంకులు జమచేయాలని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News