Wednesday, January 22, 2025

సుప్రీంలో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా..

- Advertisement -
- Advertisement -

ఎపి మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది. ఫైబర్‌ నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం బెయిల్ పటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత విచారణను నవంబర్‌ 30కి వాయిదా వేసింది. అప్పటివరకు ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించింది. ఇక, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో దీపావళీ సెలవుల తర్వాత తీర్పు వెల్లడించనున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News