Saturday, January 11, 2025

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు: కవిత పిటిషన్‌పై విచారణ మళ్లీ వాయిదా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను 28న చేపడతామని సుప్రీం కోర్టు తెలిపింది. కాగా గతంలో కవిత పిటిషన్‌ను సుప్రీం కోర్టు నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిషన్లకు జత చేసింది. ప్రస్తుతం మూడు పిటిషన్లపై వేర్వేరుగా విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. మూడు వేర్వేరు కేసులను కలిపి విచారణ చేయడం సబబు కాదని అభిప్రాయపడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News