మన తెలంగాణ/హైదరాబాద్ : తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యికల్తీ అంశంపై విచారణను సుప్రీంకోర్టు శుక్రవారం ఉదయం పదిన్నర కు వాయిదా వేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణపై కేంద్రం అభిప్రాయం చెప్పేందుకు రేపటి వరకూ సమయం కావాలని సొలిసిటర్ జనరల్ కోరడంతో విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం శుక్రవారం ఉదయం పదిన్నరకు కేసును వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించింది. శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారనే ఆరోపణలపై దర్యాప్తునకు ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్నే (సిట్) కొనసాగించాలా? లేదంటే స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయాలా? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరింది. దీనిపై ఏ విషయాన్ని గురువారం చెప్పాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. అయితే కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం చెప్పక పోవడంతో సొలిసిటర్ జనరల్ తుషార్ మొహతా వాయిదా కోరారు.
శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే విచారణలో కేంద్రం చెప్పే అభిప్రాయాన్ని బట్టి సుప్రీంకోర్టు లడ్డూ కల్తీ అంశాన్ని ఏ దర్యాప్తు సంస్థ విచారణ చేయాలన్నది ఖరారు చేస్తారు. ఆ తర్వాత ఆయా సంస్థలు విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎపి ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో ఓ సిట్ ను నియమిం చింది. వారు నాలుగు రోజుల పాటు తిరుమలతో పాటు ఏఆర్ డెయిరీలో కూడా పరిశీలించారు. అనేక వివరాలు తెలుసుకున్నారు. ప్రాధమిక నివేవది సిద్ధం చేసేటప్పటికీ సుప్రీంకోర్టు వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంతో దర్యాప్తు నిలిపివేయాలని డిజిపి నిర్ణయించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదే శాల ప్రకారమే తదుపరి విచారణ ఉంటుందని తెలిపారు. ఒక వేళ సిట్‌కు అనుమతి ఇస్తే విచారణ కొనసాగించే అవకాశం ఉంది. సిబిఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అనుమతి ఇస్తే ఆయా సంస్థలు కేసును టేకప్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే పిటిషనర్లు మాత్రం ఎవరు దర్యాప్తు చేసినా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్తలపై నమ్మకం లేదంటు న్నారు. అయితే ఇలాంటి కేసులను సుప్రీంకోర్టు తమ పర్యవేక్షణలో దర్యాప్తు చేయిస్తుందా లేదా అన్నదానిపై న్యాయనిపుణుల్లో సందేహాలు ఉన్నా యి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వైవీ సుబ్బారెడ్డి కూడా పిటిషన్‌దారులలో ఉండటంతో ఆయన కోసం దర్యాప్తు సంస్థల విశ్వసనీయతను ప్రశ్నిం చబోరని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏమైనా శుక్రవారం ఉదయం జరిగే విచారణలో కేంద్ర ప్రభత్వం వెల్లడించే అభిప్రాయాన్ని బట్టి ఏ సంస్థ దర్యాప్తు చేయాలన్నది ఖరారు చేసే అవకాశం ఉంది.