న్యూఢిల్లీ : ఎంపి సభ్యత్వ వేటుపడ్డ టిఎంసి నాయకురాలు మహువా మొయిత్రా కేసు విచారణను సుప్రీంకోర్టు జనవరి 3వ తేదీకి ఖరారు చేసింది. టిఎంసికి చెందిన మొయిత్రా తమ లోక్‌సభ సభ్యత్వ వెబ్‌సైటు లాగిన్‌ను దుర్వినియోపర్చారనే అభియోగాలు వెలువడ్డాయి. దీనితో ఆమె సభ్యత్వం రద్దు అయింది. దీనిని సవాలు చేస్తూ మొయిత్రా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాను ప్రజాప్రతినిధిగా ఉంటూ సభ్యత్వ రద్దుకు గురైనందున వెంటనే పిటిషన్‌ను విచారించి , న్యాయం చేయాల్సి ఉందని, దీని ద్వారా తనను ఎన్నుకున్న ప్రజలకు తాను సరైన జవాబు
చెప్పగల్గుతానని ఆమె తన వాదనను సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ ద్వారా సుప్రీంకోర్టు ద్వారా తెలియచేసుకున్నారు. దీనిపై స్పందించిన సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం ఈ కేసుకు సంబంధించి పూర్తి పూర్వాపరాల ఫైళ్లను పరిశీలించలేదని, , శీతాకాల విరామం తరువాత పిటిషన్‌పై విచారణ జనవరి 3న చేపడుతామని తెలిపారు. తక్షణ విచారణకు పిటిషన్‌ను స్వీకరిస్తేనే తమ క్లయింట్‌కు తగు న్యాయం జరుగుతుందని అంతకు ముందు న్యాయవాది సుప్రీం ధర్మాసనానికి తెలియచేసుకున్నారు. కానీ విచారణ జనవరికే వాయిదా పడింది.