Monday, March 3, 2025

దిగువ కోర్టుల తీర్పులపై మరోసారి సుప్రీం కోర్టు అసంతృప్తి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : హైకోర్టుల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం మరొకసారి అసహనం వ్యక్తం చేసింది. తాము ఎన్ని సార్లు చెబుతున్నా కోర్టులు అధికార పరిధిని దాటుతున్నాయని, ఇది సరైన విధానం కాదని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రూ. 5 లక్షల పరిహారం చెల్లించాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ కేసులో ప్రతివాదిని కోర్టు విడుదల చేసిన తరువాత ఆ విషయం తెలిసీ హైకోర్టు అతని పెండింగ్ బెయిల్ దరఖాస్తుపై విచారణ జరిపిందని, ఒకసారి వ్యక్తి విడుదలైన తరువాత బెయిల్ దరఖాస్తుకు విలువ లేదని సుప్రీం కోర్టు పేర్కొన్నది. దానిని కొట్టివేయాలని, కోర్టు జోక్యం చేసుకుని అందులో తప్పొప్పులను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయకూడదని సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సంజయ్ కరోల్, మన్మోహన్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News