Wednesday, January 22, 2025

గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీంకోర్టు అనుమతి

- Advertisement -
- Advertisement -

ముంబై: పౌర, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖా గృహ నిర్బంధానికి సుప్రీం కోర్టు గురువారం అనుమతించింది. అనారోగ్య కారణాలతో వైద్యం కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సానుకూలంగా స్పందించింది. న్యాయమూర్తులు కేఎం జోసెఫ్, హృషికేష్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం నవలఖాకు ఊరటనిచ్చింది. ఆయన అనారోగ్యంపై ఇచ్చిన మెడికల్ రిపోర్టును తిరస్కరించడానికి ప్రాథమికంగా ఎలాంటి కారణం కనిపించలేదని తెలిపింది. బేలాపూర్ లోని ఆయన ఇంట్లో నెల రోజుల పాటు గృహనిర్బంధంలో ఉండేందుకు కొన్ని షరతులతో అనుమతించింది. పోలీస్ సిబ్బంది కోసం ఎన్‌ఐఎ పేర్కొన్న ఖర్చులకు గాను రూ.2.4 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించింది. అలాగే గృహ నిర్బంధ కాలంలో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్, ఇంటర్‌నెట్ లేదా మరేదైనా కమ్యూనికేషన్ సాధనాన్ని వినియోగించ కూడదని ఆంక్షలు విధించింది. హౌస్ అరెస్ట్ ఆర్డర్‌ను 48 గంటల్లోగా అమలు చేయాలని ఆదేశించింది.

కాగా, మానవ హక్కుల కార్యకర్త గౌతమ్ నవలఖాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 2017 భీమా కోరేగావ్ హింసాత్మక కేసులో మహారాష్ట్ర పోలీసులు 2018లో ఆయనను అరెస్టు చేశారు. పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ సభలో నవలఖ రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్టు కేసులో పేర్కొన్నారు. నాటి నుంచి ముంబై లోని తలోజా సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. బెయిల్ కోసం నవలఖా చేసిన అభ్యర్థనకు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఎ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఆయన ముంబై హైకోర్టును ఆశ్రయించారు. తరువాత సుప్రీం కోర్టు దీనిపై విచారించింది. విచారణ ఖైదీలకు కూడా ఆరోగ్య హక్కు ఉండాలని స్పష్టం చేసింది.

Supreme Court allows house arrest of Gautam Navlakha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News