Thursday, November 21, 2024

నోటీసులివ్వకుండా ఇల్లు కూల్చివేత..యూపి ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని కూల్చివేయడమేంటని సంబంధిత అధికారులను ప్రశ్నించింది. బాధితుడికి రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2019 లో రోడ్డు విస్తరణలో భాగంగా మహారాజ్‌గంజ్ నివాసి మనోజ్ తిబ్రేవాల్ ఆకాశ్ ఇంటిని అధికారులు కూల్చివేశారు. ఇంటిని ఖాళీ చేయాలని అతడికి ఎలాంటి నోటీసులను పంపించకుండానే ఈ చర్యలకు ఉపక్రమించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు సుప్రీం కోర్టును ఆశ్రయించాడు.

నాడు దాఖలైన పిటిషన్‌పై తాజాగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం విచారణ చేపట్టింది. నోటీసులు ఇవ్వకుండా సౌండ్ స్పీకర్ ద్వారా ఇంటిని ఖాళీ చేయాలని చెప్పడం ఆమోదయోగ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితుడికి నష్టపరిహారంగా రూ. 25 లక్షలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. కూల్చివేతకు కారణమైన అధికారులు, కాంట్రాక్టర్లుపై విచారణ జరపాలని, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News