ఢిల్లీ: ఉచితాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ పార్టీలు ఉచితాలు ప్రకటించడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. పట్టణ ప్రాంతాల్లో నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారణ జరిపింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు అందుతున్నందున ప్రజలు పనిచేయడానికి ఇష్టపడడం లేదని వ్యాఖ్యానించింది. ఉచితాలతో ప్రజలు ఏ పని చేయకుండానే ఆహారం, డబ్బు సంపాదిస్తున్నారన్న ధర్మాసనం పేర్కొంది. ప్రజలకు సౌకర్యాలు అందించాలన్న ప్రభుత్వాల ఉద్దేశం మంచి విషయమే కానీ వారిని దేశ అభివృద్ధిలో భాగం చేయాలని తెలిపింది. పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను పూర్తి చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడంతో పాటు పలు సమస్యలను పరిష్కరిస్తున్నామని అటార్నీ జనరల్ ఆర్ వెంకటమరణి ధర్మాసనానికి వివరించారు. ఈ నిర్మూలన మిషన్ ఎంతకాలం పని చేస్తుందని తెలిపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిటిషన్‌ను మరో ఆరు వారాల తరువాత విచారిస్తామని వాయిదా వేసింది.
ఉచితాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం
- Advertisement -
- Advertisement -
- Advertisement -