- Advertisement -
ఎలక్టోరల్ బాండ్ల విషయంలో ఎస్బీఐ వ్యవహార శైలిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించి సమగ్రమైన వివరాలు అందజేయనందుకు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈనెల 18లోగా అన్ని వివరాలూ అందజేయాలంటూ మళ్లీ ఆదేశాలు జారీ చేసింది. ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు ఇవ్వకపోవడం వల్ల ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి నిధులు ఇచ్చిందో తెలియట్లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ మేరకు విచారణను సోమవారానికి వాయిదా వేసింది. తమ ఆదేశాలు ఎందుకు అమలు చేయలేదో వివరణ ఇవ్వాలంటూ ఎస్బీఐని ఆదేశించింది.
- Advertisement -