- Advertisement -
న్యూఢిల్లీ: ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం(పిఎంఎల్‌ఎ) చట్టం కింద అరెస్టు, ఆస్తుల జప్తు, సోదాలు, స్వాధీనానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) అధికారాలను సమర్థిస్తూ తాము జారీచేసిన ఉత్తర్వులను సమీక్షించాలని అర్థిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు సోమవారం అంగీకరించింది. సోమవారం ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో ప్రస్తావనకు రాగా దీన్ని లిస్టింగ్ చేయడానికి జస్టిస్ ఎన్‌వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. ఆర్థిక వ్యవస్థ సక్రమంగా నడిచేందుకు మనీ లాండరింగ్ ఒక ముప్పుగా పరిణమించడం ప్రపంచ వ్యాప్తంగా అనుభవంలో ఉన్నదేనని జులై 27న ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు అభిప్రాయపడిన విషయం తెలిసిందే. పిఎంఎల్‌ఎలోని కొన్ని నిబంధనల చట్టబద్ధతను సమర్ధించిన సుప్రీంకోర్టు మనీలాండరింగ్ అన్నది సామాన్యమైన నేరం కాదని పేర్కొంది.
- Advertisement -