Sunday, December 22, 2024

రాందేవ్ బాబాకు కోర్టు అక్షింతలు!

- Advertisement -
- Advertisement -

ప్రముఖ యోగా గురువు రామ్ దేవ్ బాబా, పతంజలి ఆయుర్వేద సంస్థ బాలకృష్ణ మంగళవారం సుప్రీంకోర్టు ఎదుట హాజరయ్యారు. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసు విచారణను చేపట్టిన సుప్రీంకోర్టు, తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు వారిద్దరిపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము చేపట్టే చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది. క్షమాపణలు తెలియజేస్తూ రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ పై వ్యాఖ్యానిస్తూ వారి క్షమాపణలపట్ల తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది. దీంతో కోర్టుకు వ్యక్తిగతంగా వచ్చి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ కోర్టుకు తెలియజేశారు.

పతంజలి ఆయుర్వేద సంస్థ ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ పద్ధతి తగదంటూ పతంజలి సంస్థను మందలించింది. ఇకపై అసత్య ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశించింది. అయినా ఆ హామీని ఉల్లంఘించారు. దీంతో వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయవ్యవస్థ పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొంటూ పతంజలి సంస్థ క్షమాపణలు తెలియజేసింది. తాజాగా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News