న్యూఢిల్లీ: అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ కస్టడీ మరణాల కేసులో తీసుకున్న చర్యలు, గాయాలకు సంబంధించిన సమగ్ర అఫిడవిట్‌ను కోరుతూ సుప్రీంకోర్టు శుక్రవారం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దానికి తోడు ఝాన్సీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తప్పించుకోడానికి ప్రయత్నించినప్పుడు ఇటీవల ఏప్రిల్ 13న మరణించిన అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ ఎన్‌కౌంటర్ హత్యపై నివేదికను కూడా సుప్రీంకోర్టు కోరింది. ప్రయాగ్‌రాజ్‌లో ఉమేశ్ పాల్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గులాం అతనితో పాటు ఉన్నారు. వీరిని పట్టుకున్న వారికి ఒక్కొక్కరికి రూ. 5 లక్షల రివార్డును అధికారులు ప్రకటించారు.
విచారణ సందర్భంగా న్యాయమూర్తి దీపాంకర్ దత్తా మీడియాలో చూపినట్లుగా అహ్మద్, అతని సోదరుడి హత్య పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయాగ్‌రాజ్‌కు వైద్య పరీక్ష నిమిత్తం ఏప్రిల్ 15న పోలీసులు తీసుకెళుతుండగా అతిక్ అహ్మద్, ఆయన సోదరుడు అష్రఫ్ అహ్మద్ కాల్చివేత్తలకు గురయ్యారు. 2005లో బిఎస్‌పి ఎంఎల్‌ఏ రాజు పాల్ హత్య కేసులో, ఇంకా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఉమేశ్ పాల్ హత్య కేసులో అతీక్ అహ్మద్ నిందితుడిగా ఉన్నారు.
బాధితులను అంబులెన్స్‌లో కాకుండా ఆసుపత్రికి నడిపించుకుంటూ తీసుకు వెళ్లిన ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ చర్య వెనుక కారణమేమిటని కోర్టు తెలుసుకోవాలనుకుంటోంది.
#BREAKING #SupremeCourt seeks a comprehensive affidavit from the State of UP on the steps taken to inquire into the killings of Atiq Ahmed and brother Ashraf Ahmad when they were in police custody and also the previous encounter killings of the accused in Umesh Pal Murder case. https://t.co/5p5FfqiOFn
— Live Law (@LiveLawIndia) April 28, 2023