న్యూఢిల్లీ : కర్ణాటక విద్యాసంస్థల్లో హిజాబ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ఆ రాష్ట్ర హైకోర్టు నిరాకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణకు ధర్మాసనం ఏర్పాటు చేస్తామని సుప్రీం కోర్టు మంగళవారం తెలిపింది. జడ్జీలలో ఒకరి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కేసు విచారణలో జాప్యం తలెత్తిందని సుప్రీం పేర్కొంది. హైకోర్టు ఉత్తర్వులపై గత మార్చి లోనే అప్పీలు చేసినప్పటికీ ఇప్పటివరకూ లిస్టింగ్‌కు రాలేదని అప్పీలు దారు తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది మీనాక్షి అరోరా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వీ రమణ, న్యాయమూర్తులు కృష్ణమురారి, హిమ కోహ్లితో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై సీజేఐ మాట్లాడుతూ ఒక బెంచ్ ఏర్పాటు చేస్తానని, న్యాయమూర్తుల్లో ఒకరికి ఒంట్లో బాగోలేదని చెప్పారు. దీనికి ముందు తరగతి గదుల్లో హిజాబ్ ధరించేందుకు అనుమతించాలంటూ వేసిన పిటిషన్లను కర్ణాటక హైకోర్టు గత మార్చి15 న కొట్టివేసింది. హిజాబ్ మతపరమైన ఆచారమేమీ కాదని తీర్పులో పేర్కొంది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధం.. హైకోర్టు ఉత్తర్వుపై విచారణకు సుప్రీం బెంచ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -