Sunday, December 22, 2024

అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అవివినీతి అక్రమాలతో తరచూ వార్తల్లో ఉండే హెచ్‌సిఎ కమిటీని సుప్రీం కోర్టు రద్దు చేస్తూ ఉత్తర్వూలు జారీ చేసింది. ప్రస్తుత కమిటీ స్థానంలో సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ లావు నాగేశ్వరరావుతో ఏకసభ్య కమిటీని నియమించింది. ఇకపై హెచ్‌సీఏ వ్యవహారాలు కొత్త కమిటీ చూసుకుంటుందని భారత ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది.

కాగా, త్వరలోనే హెచ్‌సీఏకు ఎన్నికలు నిర్వహించాలని కోర్టు సూచించింది. హెచ్‌సీఏలో ఎన్నికల ప్రతిష్టంభన తొలగించి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనలో సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మెన్‌గా జస్టిస్ దీపక్ వర్మ నియామకాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించడంపై ప్రతివాదులు సుప్రీంను ఆశ్రయించారు. జస్టిస్ లావు నాగేశ్వరరావుకు హెచ్‌సిఎ ఎన్నికల నిర్వహణ బాధ్యతల అప్పజెప్పాలని ప్రతివాదుల తరపు సీనియర్ న్యాయవాది దవే సుప్రీంకు పేర్కొన్నారు. దవే సూచనలను అంగీకరించిన సుప్రీం హెచ్‌సీఏ కమిటీ రద్దుకు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ ఎల్. నాగేశ్వరరావుకు అన్ని విధాలా సహకరించాలని హెచ్‌సీఏకు సుప్రీం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News