- Advertisement -
ఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో 2016లో చేపట్టిన 25000 టీచర్ నియమకాలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. భారత దేశ ఉన్నత న్యాయ స్థానంలో మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎదురు దెబ్బతగిలింది. 25000 వేల టీచింగ్ నాన్ టిచింగ్ సాఫ్ట్ నియామకాలను 2024లో కోల్‌కతా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. హైకోర్టు తీర్పులో జోక్య చేసుకునేందుకు సరైన కారణాలు కనిపించడంలేదని పేర్కొంది. దీనికింద ఉద్యోగాలు సాధించిన టీచర్లు తమ వేతనాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. టీచర్ల నియామక ప్రక్రియ అత్యంత కలుషితమైందని, కళంకమైనదని అభివర్ణించింది.
- Advertisement -