Wednesday, January 22, 2025

విద్యా సంస్థలలో హిజబ్ నిషేధంపై విచారణ చేపట్టనున్న సుప్రీం

- Advertisement -
- Advertisement -

కాలేజ్ క్యాంపస్ లోపల హిజబ్, బుర్ఖా, నఖాబ్ ధరించడాన్ని నిషేధిస్తూ ఒక ముంబై కళాశాల యాజమాన్యం తీసుకున్న నిర్ణయాన్ని బాంబే హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణ కోసం లిస్టింగ్ చేయాలని ఆదేశించినట్లు సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీకి చెందిన ఎన్‌డి ఆచార్య, డికె మరఠాఏ కళాశాలలో హిజబ్, బుర్ఖా, నఖాబ్ ధారణను నిషేధించారు. అయితే దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో జోక్యం చేసుకోలేమని, ఆ నిబంధనలను విద్యార్థుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేమని జూన్ 26న బాంబే హైకోర్టు తెలిపింది. క్రమశిక్షణను పాటించాలన్న ఉద్దేశంతోనే డ్రెస్ కోడ్ అమలు చేస్తారని, ఇది విద్యా సంస్థ పాలన,

స్థాపనకు సంబంధించి కళాశాల యాజమాన్యానికి ఉన్న ప్రాథమిక హక్కని హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. మంగళవారం చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జెబి పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఎదుట న్యాయవాది అబీహా జైదీ ఈ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ అత్యవసరంగా దీనిపై విచారణ చేపట్టాలని అర్థించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ ఈ పిటిషన్ విచారణ బాధ్యతను వేరే ధర్మాసనానికి అప్పగించామని, త్వరలోనే ఇది లిస్టింగ్ అవుతుందని ధర్మాసనం తెలిపింది.ఆ విద్యా సంస్థలు జారీచేసిన ఆదేశాలలోని చట్టబద్ధతను సుప్రీంకోర్టు పరిశీలించనున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News