Wednesday, January 22, 2025

తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ కవాతులకు సుప్రీంకోర్టు అనుమతి!

- Advertisement -
- Advertisement -
మద్రాస్ హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వం పిటిషన్‌లు కొట్టివేత

న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రమంతటా రూట్ మార్చ్ నిర్వహించడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)కు సుప్రీంకోర్టు మంగళవారం అనుమతించింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వును సవాలుచేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలుచేసిన వినతిని కొట్టివేసింది. న్యాయమూర్తి వి.రామసుబ్రణ్యన్ నేతృత్వంలోని ధర్మాసనం ‘అన్ని స్పెషల్ లీవ్ పిటిషన్లను కొట్టివేశాము’ అన్న ఏక వాక్యంతో తీర్పు వెలువడింది. తీర్పుకు సంబంధించిన వివరాలు ఇంకా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కావలసి ఉంది.
విచారణ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ తరఫున సీనియర్ అడ్వొకేట్ మహేశ్ జెఠ్మాలనీ తన వాదన వినిపిస్తూ తమిళనాడులో ఒకవేళ ఉగ్రవాద సంస్థలు ఆర్‌ఎస్‌ఎస్ మార్చ్‌కు ముప్పు కలిగించేట్టయితే రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు మూసుకు కూర్చోకూడదని వాదించారు. ఇటీవల తమిళనాడులో పిఎఫ్‌ఐ బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్ ఈ మార్చ్ తలపెట్టింది. దీనిని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించినప్పటికీ సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. శాంతియుతంగా మార్చ్ నిర్వహించాలనుకుంటున్న సంస్థను రాష్ట్ర ప్రభుత్వం ఆపడానికి లేదని ఆర్‌ఎస్‌ఎస్ విజ్ఞప్తి చేసుకుంది. ఓ నిషిద్ధ సంస్థకు భయపడి శాంతియుత మార్చ్‌ను ఆపడానికి వీలులేదన్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News