Tuesday, January 7, 2025

రామ్‌దేవ్ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : తప్పుదారి పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనల కేసులో యోగా గురు బాబా రామ్‌దేవ్, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సమర్పించిన క్షమాపణను సుప్రీం కోర్టు అంగీకరించిన పిదప వారిపై ధిక్కరణ కేసును మంగళవారం మూసివేసింది.

‘రామ్‌దేవ్, బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సమర్పించిన క్షమాపణలు ప్రాతిపదికగా కోర్టు ధిక్కరణ చర్యలకు స్వస్తి పలికింది’ అని యోగా గురు రామ్‌దేవ్, బాలకృష్ణ, పతంజలి సంస్థకు ప్రాతినిధ్యం వహించిన న్యాయవాది గౌతమ్ తాలుక్‌దార్ వెల్లడించారు. ధిక్కరణ నోటీస్‌పై తన ఉత్తర్వును సర్వోన్నత న్యాయస్థానం మే 14న రిజర్వ్ చేసింది. కొవిడ్ టీకాల కార్యక్రమం, ఆధునిక వైద్య విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ భారతీయ వైద్య సంఘం (ఐఎంఎ) దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News