Tuesday, November 5, 2024

నాలుగు హైకోర్టులకు జడ్జీలుగా 16 మంది పేర్లను సూచించిన కొలీజియం

- Advertisement -
- Advertisement -

Supreme Court Collegium recommends 16 names

న్యూఢిల్లీ: నాలుగు హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ నేతృత్వంలోని కొలీజియం 16 మంది పేర్లను సిఫార్సు చేసింది. బొంబాయి , గుజరాత్, పంజాబ్, హర్యానా హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించడం కోసం బుధవారం జరిగగిన సమావేశంలో కొలీజియం ఈ పేర్లను ఆమోదించింది. వీరిలో ఆరుగురు జ్యుడీషియల్ అధికారులు ఉండగా, మిగతా పది మంది న్యాయవాదులున్నారు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన ప్రకటనల ప్రకారం బాంబే హైకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించడానికి నలుగురు జ్యుడీషియల్ అధికారులు ఎఎల్ పన్సారే, ఎస్‌సి మోరే, యుఎస్ జోషీ ఫాల్కే, బిపి దేశ్‌పాండే పేర్లను సిఫార్సు చేశారు. అలాగే ఒడిశా హైకోర్టులో జడ్జిలుగా నియమించడానికి అడ్వకేట్లు ఆదిత్య కుమార్ మోహపాత్ర, మృగాంక శేఖర్ సాహు, జ్యుడీషియల్ ఆఫీసర్లు రాధాకృష్ణ పట్నాయక్, శవఙకాంత్ మిశ్రాల పేర్లను సిఫార్సు చేశారు.

గుజరాత్ హైకోర్టుకు జడ్జీలుగా నియమించడానికి ఏడుగురు అడ్వకేట్లు మౌన మనీశ్ భట్, సమీర్ ఎస్ దవే, హేమంత్ ఎం ప్రచ్ఛక్, సందీప్ ఎన్ భట్, అనురుద్ధ ప్రద్యుమ్న మాయీ, నిరల్ రష్మీకాంత్ మెహతా, నిషా మహేంద్రభాయ్ థాకోరే పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. అలాగే ఈ నెల 29న జరిపిన సమావేశంలో సుప్రీంకోర్టు కొలీజియం అడ్వకేట్ సందీప్ మౌద్గల్‌లు పంజాబ్, హర్యానా హైకోర్టుకు జడ్జిగా పదోన్నతి కల్పించాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది అని ఓ ప్రకటన తెలిపింది. హైకోర్టుల్లో నియామకాలకు సంబంధించిన వ్యవహారాలను చూసే మ్గురు సభ్యుల కొలీజియంలో చీఫ్ జస్టిస్ కాక న్యాయమూర్తులు యుయు లలిత్, ఎఎం ఖన్విల్కర్‌లు ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్‌వి రమణ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తులు పదవులు భారీ సంఖ్యలో ఖాళీగా ఉన్న నేపథ్యంలో వాటిని భర్తీ చేయడానికి కొలీజియం చర్యలు తీసుకుంటోంది. వివిధ హైకోర్టుల్లో జడ్జీలుగా నియమించడానికి ఇప్పటివరకు సుమారు వందమంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News