Monday, December 23, 2024

సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి పేర్లు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు జడ్జీలుగా ఇద్దరి జడ్జీల పేర్లను చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం లోని కొలిజియమ్ కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, సీనియర్ అడ్వకేట్ కెవి విశ్వనాథన్ పేర్లను సిఫారసు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ సిఫారసును అంగీకరిస్తే 2030 ఆగస్టు 11 నాటికి రిటైర్ కానున్న జెబి పార్ధివాలా తరువాత కెవి విశ్వనాథన్ చీఫ్ జస్టిస్ అవుతారు. 2031 మే 25 వరకు ఆ పదవిలో ఉంటారు. సుప్రీం కోర్టు కొలిజియమ్ 34 మంది జడ్జీలను మంజూరు చేయగా, ప్రస్తుతం 32 మంది మాత్రమే పనిచేస్తున్నారని కొలిజియమ్ వెల్లడించింది. గత రెండు రోజుల్లో సుప్రీం కోర్టు జడ్జీలు దినేష్ మహేశ్వరి, ఎంఆర్‌షా రిటైర్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News