Monday, January 20, 2025

ముగ్గురు హైకోర్టు జడ్జీల బదిలీ అభ్యర్థనపై కొలీజియమ్ సిఫారసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ముగ్గురు హైకోర్టు జడ్జీల అభ్యర్థనపై వారిని బదిలీ చేయడానికి సుప్రీం కోర్టు కొలీజియమ్ సిఫార్సు చేసింది. చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్‌లు సంజీవ్ ఖన్నా, బీఆర్ గవాయి, సూర్యకాంత్, అనిరుద్ధ బోస్ లతో కూడిన కొలీజియమ్ మంగళవారం సమావేశమై ముగ్గురు హైకోర్టు జడ్జీలు మౌసుమి భట్టాచార్య (కోల్‌కతా) అనూ శివరామన్ (కేరళ),సుజోయ్ పాల్ (మధ్యప్రదేశ్) బదిలీకి చేసిన అభ్యర్థనను పరిగణన లోకి తీసుకుంది మౌసుమి భట్టాచార్య తెలంగాణ హైకోర్టుకు, అనూ శివరామన్ కర్ణాటక హైకోర్టుకు, సుజోయ్ పాల్ తెలంగాణ హైకోర్టుకు తమ వ్యక్తిగత ప్రయోజనాల దృష్టా బదిలీలను ఈనెల 12న కోరుకున్నారు. వీరి అభ్యర్థనను కొలీజియమ్ అంగీకరించింది. ఈ తీర్మానాన్ని అపెక్స్ కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచినట్టు కొలీజియమ్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News