Sunday, January 19, 2025

తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ హైకోర్టు నుంచి ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ
జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు
జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ డి.నాగార్జున్ కర్ణాటక హైకోర్టుకు
దేశవ్యాప్తంగా ఏడుగురు న్యాయమూర్తులను బదిలీ
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ హైకోర్టుతో పాటు పలు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది. రాష్ట్ర హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత కన్నెగంటి,జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ బదిలీ అయ్యారు. జస్టిస్ ఎ.అభిషేక్ రెడ్డి పాట్నా హైకోర్టుకు బదిలీ కాగా, జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ డాక్టర్ డి.నాగార్జున్ కర్ణాటక హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెందిన జస్టిస్ భట్టు దేవానంద్ మద్రాస్ హైకోర్టుకు, జస్టిస్ డి.రమేష్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ కాగా, మద్రాస్ హైకోర్టుకు చెందిన జస్టిస్ వి.ఎం. వెలుమణి కలకత్తా హైకోర్టుకు, టి.రాజాను రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ మేరకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదించారు.

Supreme Court Collegium transfer of 7 HC Judges

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News