సుప్రీం కొలీజియం సిఫారసును
తీవ్రంగా వ్యతిరేకించిన అలహాబాద్
హైకోర్టు బార్ అసోసియేషన్
ఆయన గత తీర్పులపై సమీక్ష
జరపడంతో పాటు అభిశంసన
ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి
వర్మ బదిలీని వ్యతిరేకిస్తూ నేటి
నుంచి లాయర్ల నిరవధిక దీక్ష
యశ్వంత్‌ను విధులకు దూరం
పెట్టిన ఢిల్లీ హైకోర్టు
ప్రయాగ్‌రాజ్ /లక్నో : జస్టిస్ వర్మ ఇంట్లో అగ్నిప్రమాదంలో నోట్ల కట్టలు తగులపడ్డాయన్న ఆ రోపణల నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జడ్జి య శ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చే యాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకించింది.మార్చి14న వర్మ అధికార నివాసం లో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున నగ దు పట్టుబడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రయాగ్ రాజ్‌లో సోమవారం నాడు జరిగిన సమావేశం లో జస్టిస్ వర్మ బదిలీ నిర్ణయాన్ని ఖండించారు. తక్షణం చర్యలు చేపట్టాలని అసోసియేషన్ అ ధ్యక్షుడు అనిల్ తివారీ డిమాండ్ చేశారు. జస్టిస్ వర్మ బదిలీని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించే ది లేదని ఆయన స్పష్టంచేశారు.
జస్టిస్ వర్మపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు సంస్థలతో విచారణకు అనుమతించాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారు. వర్మ ను అభిశంసించే ప్రక్రియ కూడా చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశా రు. ఆయనపై కేసునమోదు చేసి సిబిఐ, ఇడితో విచారణ జరిపించాలని సిజెఐని కోరుతూ బార్ అసోసియేషన్ తీర్మానించింది. ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు ఆయనను బదిలీ చేయడాన్ని నిరసిస్తూ నేటి నుంచి లాయర్లు నిరవధిక దీక్షలకు పూనుకుంటున్నట్లు తివారీ వెల్లడించారు.
కొలీజియం కీలక నిర్ణయం
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జస్టిస్ వర్మ వ్యవహారంలో సుప్రీం కోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. దీనిపై కేంద్రం ఆమోదం లభించాక తుది ప్రకటన వెలువడ నుంది. అయితే ఈ నిర్ణయంపై కొలీజియం లోని కొందరు సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉంటే అంతకు ముందు సోమవారం అంతకు ముందు జస్టిస్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు అది అమలులో ఉంటుందని తెలియజేసింది.
కానీ ఇంతలోనే కొలిజియం ఈ నిర్ణయం తీసుకుంది. అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ యశ్వంత్ వర్మను బదిలీ చేస్తూ కేంద్రానికి సిఫారసు చేయడం కోర్టు వెబ్‌సైట్‌లో బహిర్గతమైంది. “ మార్చి 20,24 తేదీల్లో సుప్రీం కోర్టు కొలిజియం సమావేశాల్లో అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మను బదిలీ చేస్తూ నిర్ణయించడమైంది ” అని తీర్మానంలో పేర్కొంది. జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంగా పోలీసులు తీసిన వీడియోలో కాలిన నోట్ల కట్టలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ వీడియోను పోలీస్ కమిషనర్ ఢిల్లీహైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయకు సమర్పించగా, ఆయన దానిని తన నివేదికలో పొందుపరిచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు అందించారు.