Sunday, April 13, 2025

సాధికార కమిటీకి సర్కార్ నివేదిక

- Advertisement -
- Advertisement -

కంచ గచ్చిబౌలి
భూముల్లో సుప్రీంకోర్టు
సాధికారత కమిటీ
పరిశీలన పర్యావరణ,
అటవీశాఖ అధికారుల భేటీ
అవి సర్కార్ భూములే
రెవెన్యూ, అటవీ రికార్డుల్లో
ప్రభుత్వ భూమిగానే
నమోదు అటవీ
భూమిగా ఎప్పుడూ
నోటిఫై

మన తెలంగాణ/హైదరాబాద్/గచ్చిబౌలి : కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని పరిశీలించేందుకు కేంద్ర సా ధికారిక కమిటీ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టింది. నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం లో పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి సీఎస్ శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, డీజీపీ జితేందర్, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు ఈ సమావేశానికి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున కమిటీ
సభ్యులతో దాదాపు 3 గంటలపాటు చర్చించారు. 400 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులు, ప్రభుత్వ విధివిధానాలు, ఈ క్రమంలో చోటుచేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కమిటీకి నివేదిక సమర్పించారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో గురువారం కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది.

ఉదయం భూములను సందర్శించిన కమిటీ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై వివరాలను తెలుసుకున్న అనంతరం ఎంసీహెచ్‌ఆర్‌డీలో విద్యార్థి సంఘాల నేతలతో భేటీ అయి వివరాలు సేకరించింది. తాజ్‌కృష్ణ హోటల్‌లో మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ వ్యవహారంపై కమిటీకి నివేదిక ఇచ్చింది. అలాగే బిజెపి ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్‌రావు కూడా ఈ కమిటీని కలిసి తమ నివేదకను అందించారు. హెచ్‌సీయూ పాలకవర్గం భూముల అంశంపై సమగ్ర వివరాలు తీసుకుంది. టీజీఐఐసీ ఈ భూములను చదును చేపట్టిన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందచేయాలని కమిటీకి సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే బుధవారం సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరు కంచ గచ్చిబౌలి భూముల్లో పరిశీలన జరిపి వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసి సుప్రీంకోర్టుకు నివేదిక అందించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అధ్యయనం చేసి ఆ కమిటీ సుప్రీంకోర్టుకు నివేదిక అందచేయనుంది.

కంచ గచ్చిబౌలి భూములలో పర్యటన
కంచ గచ్చిబౌలి భూములను గురువారం సాధికార కమిటీ పరిశీలించింది. కమిటీ చైర్మన్ సిద్ధాంత్ దాస్‌తో సహ ముగ్గురు ప్రతినిధులతో కూడిన బృందం ఉదయం 10 గంటల నుండి కంచ గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితులను ఆరాతీశారు. మాదాపూర్ డిసిపి వినీత్ బృందంతో పాటుగా బందోబస్తు నిర్వహించారు. అనంతరం సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కూడా అక్కడకి చేరుకొని పరిస్థితులను సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, అటవిశాఖ అధికారులు, సిబ్బంది బృందంతో పాటు యూనివర్సిటీ భూముల వివరాలను అందించారు. అక్కడే ఉన్న విద్యార్థులు ఎంపవర్ బృందంతో మాట్లాడే ప్రయత్నం చేసిన అధికారులు వారిని అడ్డుకున్నారు. హెచ్‌సియూ విద్యార్థులలో కొంతమందిని జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో కలిసే అవకాశం కల్పించడంతో ఐదుగురు విద్యార్థి సంఘాల నాయకులు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు వర్సిటీ భూములపై జరుగుతున్న వివాదం, విద్యార్థులు, ప్రతిపక్షాలు చేస్తున్న అభ్యంతరాలతోపాటు మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి సమాచారాన్ని సేకరించి నివేదికను అందించేందుకు ఎంపవర్ కమిటీ సిద్ధమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News