న్యూఢిల్లీ: కేంద్రం కొత్తగా రూపొందించిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పశ్చిమ బెంగాల్‌తోసహా 8 రాష్ట్రాలకు చెందిన 12 వ్యవసాయ సంఘాలు, రైతులతో చర్చలు శుక్రవారం జరిపింది. ఇప్పటి వరకు కమిటీ నిర్వహించిన ఏడవ సమావేశం ఇది. ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ రైతు సంఘాలు, రైతులతో ఆన్‌లైన్ ద్వారా, వ్యక్తిగతంగా కూడా సంప్రదింపులు జరుపుతోంది. రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ ఉత్పాదక సంస్థల(ఎఫ్‌పిఓ)తో వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరిపినట్లు కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూ కశ్మీరు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చెఇన 12 రైతు సంఘాలు, రైతులు కమిటీ సభ్యులతో సవివరంగా చర్చలు జరిపారని కమిటీ తెలిపింది. మూడు వ్యవసాయ చట్టాలపై వీరంతా తమ అభిప్రాయాలను, సూచనలను సవివరంగా తెలిపారని కమిటీ పేర్కొంది.
12 రైతు సంఘాలతో సుప్రీంకోర్టు కమిటీ చర్చలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -