- Advertisement -
హైకోర్టు తీర్పును ధ్రువీకరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఒక ఏడున్నరేళ్ల మానసిక, శారీరక వికలాంగురాలైన మైనర్ బాలికపై హత్యాచారానికి పాల్పడిన దోషికి మరణశిక్ష విధిస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు శుక్రవారం ధ్రువీకరించింది. ఇది అత్యంత ఘోరమైన నేరమని, అత్యంత పాశవికంగా ఆ చిన్నారి బాలికపై అత్యాచారం జరిపి హత్య చేయడం హృదయాలను కలచివేసే ఘటన అంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. 2015మే 29న రాజస్థాన్ హైకోర్టు నిందితుడికి మరణశిక్ష విధిస్తూ ఇచ్చిన తీర్పును జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిసి సిటి రవికుమార్‌తో కూడిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ధ్రువీకరించింది. 2013 జనవరి 17న నిందితుడు ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడి హత్య చేశాడు.
- Advertisement -